Ajay Devgan: సర్దార్ మళ్లీ వస్తున్నాడు.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన స్టార్ హీరో

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan) నటించిన ‘సన్ఆఫ్ సర్దార్’ ఎలాంటి హిట్ అందుకుందో అందరికి తెలిసిందే.

Ajay Devgan: సర్దార్ మళ్లీ వస్తున్నాడు.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan) నటించిన ‘సన్ఆఫ్ సర్దార్’ ఎలాంటి హిట్ అందుకుందో అందరికి తెలిసిందే. అశ్విని ధీర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ2012లో వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఇనాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ‘సన్ ఆఫ్ సర్దార్-2’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సీక్వెల్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

దీనికి విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తుండగా.. దేవ్‌గణ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే, అజయ్ నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో సంజయ్ దత్, సాహిల్ మెహతా, సంజయ్ మిశ్రా, రవికృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశాడు అజయ్ దేవగన్. ‘సర్దార్ మళ్లీ వస్తున్నాడు’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌లో రెండు యుద్ధ ట్యాంక్స్ ఉండగా.. వాటిపై నిలబడి పౌరుషంగా మీసం మెలేస్తున్నట్లు చూపించి అజయ్ దేవగన్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. చిత్రం భారీ అంచనాల మధ్య జూలై 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Next Story