- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aishwarya Rajesh: హిట్ సిరీస్‌కు సీక్వేల్ ప్రకటించిన మూవీ మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్
గత కొద్ది రోజుల నుంచి ఓటీటీల్లో పలు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూ సినీ ప్రియులను విశేషంగా అలరిస్తున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీల్లో పలు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూ సినీ ప్రియులను విశేషంగా అలరిస్తున్నారు. కొన్ని సిరీస్‌లకు సీక్వెల్స్ కూడా తెరకెక్కుతూ ఊహించని విధంగా రెస్పాన్స్‌కు దక్కించుకుంటున్నాయి. అయితే ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), కాథిర్ కాంబోలో వచ్చిన ‘సుజల్: ది వోర్టెక్స్’ 2022లో వచ్చి ఎంతగా ప్రేక్షకాదరణను పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను పుష్కర్-గాయత్రి(Pushkar-Gayatri) క్రియేట్ చేయగా.. మురుగేయాన్ తెరకెక్కించారు. ఇందులో ఆర్ పార్తిబన్, హరీష్ ఉత్తమన్, శ్రియా రెడ్డి(Shriya Reddy) కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సిరీస్ ఏకంగా 30 భాషల్లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అలాగే పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ‘సుజల్’(Suzhal ) సీక్వెల్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ‘సుజల్: ది వోర్టెక్స్-2’(Suzal: The Vortex-2) ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఐశ్వర్య రాజేష్, కాథిర్ కోపంగా చూస్తుండగా.. వెనకాల కళ్లకు కాటుక ముఖ్యంగా ఎరుపు, నలుపు రంగు బొట్లతో ఉన్న ఓ భయంకరమైన ముఖాన్ని చూపించారు. అలాగే వీరిద్దరి చుట్టూ జాతర వాతావరణాన్ని చూపించగా.. అందులో కొంతమంది వేషాలు వేసుకుని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ భయంకరంగా ఉండి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే సీజన్-1లో ఉన్న పాత్రలతో పాటు ఇందులో మంజిమా మోహన్, కాయల్ చంద్రన్ గెస్టులుగా నటిస్తున్నట్లు సమాచారం.






