చీరలో రంభ, ఊర్వశి, మేనకను తలపిస్తున్న వెంకటేష్ భార్య.. నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్స్

by Kodari Anjali |

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చీరలో రంభ, ఊర్వశి, మేనకను తలపిస్తున్న వెంకటేష్ భార్య.. నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే ఈ ఏడాది అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో వెంకీకి భార్యగా యాక్ట్ చేసింది. అయితే ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఐశ్వర్య రాజేష్. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని జుట్టు అల్లుకొని, పూలు కూడా పెట్టుకుంది. అలాగే ఒంటినిండా నగలతో సింగారించుకుంది. చాలా అందంగా, వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ వావ్ క్యూట్, నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story