- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ కలర్ డ్రెస్‌లో చేతులు పైకెత్తి స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్
బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ చిత్రాల ద్వారా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 'కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ కోసం కొంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా కెరీర్‌ను కొనసాగిస్తోంది. సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ షోకు దూరంగా కనిపించే ఐశ్వర్య రాజేష్, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ స్టైలిష్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ భామకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలలో ఐశ్వర్య రాజేష్ బ్లాక్ కలర్ టైట్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించింది. చేతులను పైకెత్తి విభిన్న యాంగిల్స్‌లో ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంది.
మెడలో చైన్, చేతికి ఉంగరం ధరించి, హెయిర్ స్టైల్‌ను సింపుల్‌గా ఉంచడం ఆమె లుక్‌ను మరింత ఎలిగెంట్‌గా మార్చింది. మొత్తంగా ఈ ఫొటోలలో ఐశ్వర్య రాజేష్ స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్‌లో మెరిసిపోతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Photos Courtesy: Instagram






