Aradhya Bachchan : కోర్టుకెక్కిన ఐశ్వర్యారాయ్ డాటర్

by Muthe.Rajitha |

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్(Aishwarya Roy Bachchan) గురించి తెలియని వారుండరు.

Aradhya Bachchan : కోర్టుకెక్కిన ఐశ్వర్యారాయ్ డాటర్
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్(Aishwarya Roy Bachchan) గురించి తెలియని వారుండరు. తన అందంతో, నటనతో సినీ రంగాన్ని ఏలడమే కాదు.. ఎప్పుడూ ఏదోక వార్తతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా కూడా ఐశ్వర్య నిలుస్తూ ఉంటుంది. ఆమెనే కాదు బచ్చన్ కుటుంబం(Bachchan Family) కూడా అనేకసార్లు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఐశ్వర్య వార్తల్లో సంచలనంగా నిలిచింది. అయితే ఈసారి ఐష్ కాకుండా.. ఆమె డాటర్ ఆరాధ్య బచ్చన్(Aradhya Bachchan) వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళితే.. తన ఆరోగ్యంపై కొన్ని వెబ్సైట్స్ తప్పుడు కథనాలు(Fake News) ప్రచురిస్తున్నాయని, తక్షణమే వాటిని తొలగించేలా ఆర్డర్స్ ఇవ్వాలంటూ.. ఆరాధ్య కోర్టుకెక్కింది. సోమవారం ఢిల్లీ హైకోర్టు(Dhelhi High Court)లో ఆరాధ్య బచ్చన్ ఈ తన పిటిషన్ దాఖలు చేశారు.

అయితే గతంలో "ఇకలేరు" అంటూ పలు యూట్యూబ్ ఛానెల్స్ ఆరాధ్యపై పలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయగా.. వాటిపై అభిషేక్ బచ్చన్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్.. చిన్నారిని గౌరవంగా చూడాలని, ఆరోగ్యానికి సంబధించిన తప్పు వార్తలను పబ్లిష్ చేయరాదని మండిపడింది. సంబంధిత కంటెంట్ ను తొలగించాలని గూగుల్(Google), యూట్యూబ్(Youtube) తో సహ.. పలు వెబ్సైట్లకు, సోషల్ మీడియా అకౌంట్లకు ఢిల్లీ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయా సంస్థలు తాత్కాలికంగా తొలగించినప్పటికీ.. మళ్ళీ ప్రసారం చేస్తుండటంతో మరోసారి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్ట్ మార్చి 17కు కేసును వాయిదా వేసింది.

Next Story