- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సిందూర్... ఐశ్వర్య రాయ్ పై ప్రశంసలు !
బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్న

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలు చేసి, భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది ఐశ్వర్య. అప్పట్లో ఆమె ఏ సినిమా చేసినా, బంపర్ హిట్... కొట్టడం గ్యారంటీ. అయితే ఓ కూతురు ఉన్నప్పటికీ... ఆమె అందచందాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే అలాంటి ఐశ్వర్య పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు. ఎన్నడూ లేనిది తాజాగా సిందూర్ ( Sindhoor ) పెట్టుకొని మెరిసింది ఐశ్వర్య.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈవెంట్లో.... సిందూర్ పెట్టుకొని ఐశ్వర్యరాయ్ కనిపించింది. ఆమె అలా కనిపించడంతోనే... ఇండియాలోని ఆదిశక్తి దర్శనం ఇచ్చినట్లయితే. ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు.. ఆపరేషన్ సిందూర్ ( OperationSindoor ) నిర్వహించింది ఇండియన్ ఆర్మీ.
దీంతో దాదాపు 100 నుంచి 150 మంది ఉగ్రవాదులను చంపేశారు ఇండియన్ ఆర్మీ సభ్యులు. అయితే ఈ విషయాన్ని... ప్రపంచ దేశాలకు కనిపించేలా... ఐశ్వర్య రాయ్ తాజాగా సిందూర్ పెట్టుకొని వచ్చిందని చెబుతున్నారు. అలాగే.. మొన్నటి యుద్ధం నేపథ్యంలో చాలా మంది సైనికులు, సామాన్యులు కూడా మరణించారు. వాళ్లందరికీ నివాళులు అర్పించేందుకుగాను.. సిందూర్ తో ఐశ్వర్య మెరిసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు దేశభక్తి ఎక్కువ అని.. అందుకే ఇండియా రేంజ్ ఏంటో చూపించేందుకు ఇలా చేసిందని కూడా అంటున్నారు. దీంతో ఐశ్వర్య ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.






