- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డ్ డ్రెస్‌లో గ్లామర్ షోతో కట్టిపడేస్తున్న ఐశ్వర్య మీనన్
గోల్డ్ డ్రెస్‌లో గ్లామర్ షో చేసిన ఐశ్వర్య మీనన్

దిశ, వెబ్ డెస్క్: ఐశ్వర్య మీనన్ 2012లో విడుదలైన తమిళ చిత్రం ‘కాదలిల్ సోధప్పువదు ఎప్పడి’తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇక 2022లో రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఖిలాడి’ చిత్రం ద్వారా ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది.
అయితే ఇందులో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆ తర్వాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘స్పై’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ తర్వాత ‘భజే వాయు వేగం’ అనే తెలుగు చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.
తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ, తన అందం మరియు స్టైలిష్ లుక్స్‌తో కుర్రకారు మనసు దోచుకుంది. ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
అలాగే అప్పుడప్పుడు తన హాట్ మరియు స్టైలిష్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆ ఫోటోలలో ఐశ్వర్య అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెరిసే గోల్డ్ కలర్ డ్రెస్ ధరించి కనిపించింది. తన అందాలు హైలైట్ అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోజులు ఇచ్చింది. మొత్తంగా ఈ పిక్స్‌లో ఆమె ఎంతో గ్లామరస్ మరియు స్టైలిష్‌గా కనిపించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






