టాలీవుడ్‌ను కుదిపేస్తున్న మరో వివాదం.. అల్లు అర్జున్, శ్రీలీలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

by Bhoopathi Nagaiah |

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుతోంది. అగ్రహీరోల నుంచి చిన్న నటుల వరకు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు.

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న మరో వివాదం.. అల్లు అర్జున్, శ్రీలీలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుతోంది. అగ్రహీరోల నుంచి చిన్న నటుల వరకు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప-2 వివాదం, నాగార్జున ఎన్ కన్వర్షన్ కూల్చివేత, రాజ్ తరుణ్, లావణ్యల ఎఫైర్ కేసు, మంచు ఫ్యామిలీ గొడవలు ఇలా సినిమాల కంటే కాంట్రవర్సీలతోనే కాలం గడుపుతోంది. ఇవి చాలదన్నట్లు తాజాగా అల్లు అర్జున్, శ్రీలీల మరో వివాదంలో చిక్కారు. వీరిద్దరిపై పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలు అల్లు అర్జున్, శ్రీలీల మెడకు చుట్టుకున్నాయి. పలు టాప్ కాలేజీలు టాప్ ర్యాంకర్స్ మా కాలేజీల్లోనే చదివారంటూ పత్రికల్లో పతాక శీర్షికలో యాడ్స్ కుమ్మరించాయి. అయితే పలువురు టాప్ ర్యాంకర్స్‌ ఫొటోలను పలు కాలేజీలు మా కాలేజీలోనే చదివారంటూ ప్రకటలు గుప్పించాయి. దీనిపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం చెప్పాయి. ఒకే విద్యార్థి ఒకే సమయంలో వివిధ కాలేజీల్లో ఎలా చదువతారంటూ ప్రశ్నించాయి. పలు కార్పోరేట్ కాలేజీ యాజమాన్యాలు టాప్ ర్యాంకర్స్‌ను, వారి తల్లిదండ్రులను కొనుగోలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డాయి.

అలాగే పలు కార్పోరేట్ కాలేజీలకు అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉండి ఆయా కాలేజీలను ప్రమోట్ చేశారని, వీరి తప్పుడు ప్రచారం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు నష్టపోతున్నారని ఏఐఎస్ఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్పోరేట్ కాలేజీలు ఇచ్చే పారితోషికాలు తీసుకుంటూ ఆ కాలేజీల విద్యాప్రమాణాలు కూడా తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో AISF పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ తప్పుడు ప్రకటనలపై విచారణ చేయాలని డిమాండ్ చేసింది.

Next Story