Rave Party : పాకిస్తాన్ రేవ్ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోన్న న్యూస్(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-04-11 07:14:19  IST  )

రీసెంట్‌గా పాకిస్తాన్‌ పంజాబ్‌లోని కసూర్‌లో ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ హెడ్ లైన్స్ టచ్ చేసింది. లౌడ్ మ్యూజిక్, డ్యాన్స్, మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు

Rave Party : పాకిస్తాన్ రేవ్ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోన్న న్యూస్(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : రీసెంట్‌గా పాకిస్తాన్‌ పంజాబ్‌లోని కసూర్‌లో ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ హెడ్ లైన్స్ టచ్ చేసింది. లౌడ్ మ్యూజిక్, డ్యాన్స్, మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు దాడి చేశారు. 55 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది పాకిస్తాన్ ఆర్మీలోని సీనియర్ అధికారులు, పీఎమ్ఎల్-ఎన్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పిల్లలుగా తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈవెంట్ ఆర్గనైజర్, పోలీసుల ఒప్పందంలో భాగంగానే ఈ క్లిపింగ్స్ లీక్ అయ్యాయని ఆరోపణలు రావడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

నిజానికి పాకిస్తాన్‌లో రేవ్ పార్టీలు చాలా అరుదు. కానీ ధనిక, ఉన్నత వర్గాలలో కొంతమంది ఇలాంటి కార్యక్రమాలను రహస్యంగా ఫామ్‌హౌస్‌ వంటి ప్రదేశాలలో నిర్వహిస్తారు. ఈ పార్టీలలో డ్రగ్స్ వినియోగం, నచ్చినట్లుగా ఎంజాయ్ చేయడం మామూలే. కాగా ఈ పార్టీలో బాలీవుడ్ హీరోయిన్‌ కరీనా కపూర్‌తో డ్యాన్స్ చేయించడం వైరల్ అయింది. ఏఐ హెల్ప్‌తో జనరేట్ చేసిన యానిమేషన్ వీడియో చాలా అగ్లీగా ఉండటంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. భవిష్యత్తులో ఏఐతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తలుచుకుంటాయో భయమేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story