Ahaan Panday: నా అభిమానాన్ని ఈ రూపంలో చూపించా.. అహాన్ పాండే కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

చిన్న చిత్రంగా వచ్చి హ్యాట్రిక్ హిట్ అందుకున్న మూవీస్‌లో ‘సైయారా’ ఒకటి.

Ahaan Panday: నా అభిమానాన్ని ఈ రూపంలో చూపించా.. అహాన్ పాండే కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: చిన్న చిత్రంగా వచ్చి హ్యాట్రిక్ హిట్ అందుకున్న మూవీస్‌లో ‘సైయారా’ ఒకటి. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించారు. జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రూ. 50 కోట్లతో తెరకెక్కి దాదాపు రూ. 570 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రజెంట్ ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. అయితే.. ఈ సినిమాలో విరాట్ కోహ్లీని అనుకరించే ఓ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అహాన్ పాండే దీనిపై మాట్లాడుతూ.. ‘నేను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానిని. ఆయన నిజంగా లెజెండ్. పరుగులు చేసి రికార్డులు ఎవరైనా సృష్టిస్తారు. కానీ ఎప్పటికీ గుర్తుండాలంటే మాత్రం ఆయనలా జీవించాలి. విరాట్‌పై నాకున్న అభిమానాన్ని ఈ సినిమాలో ఆ సన్నివేశంతో చూపించాలనకున్నాం. దాని కోసం ఎంతో కష్టపడ్డాం. అయితే.. ఆడిషన్స్ చేసే సమయంలోనే ఆ సన్నివేశం అలా చేయాలన్న ఆలోచన వచ్చింది. నిజానికి ఆ సీన్ చాలా సహజంగా వచ్చింది. విరాట్‌ను అనుకరిస్తే ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారు. అందుకే ఆ సన్నివేశం క్రియేట్ చేశాం’ అని తెలిపాడు.


Next Story