వయసు పెరగడం రాత్రికి రాత్రే జరగదు.. బాడీ షేమింగ్‌పై టబు సంచలన వ్యాఖ్యలు!

by Mallepaka Hamsa |

మన వయసు గురించి మనకంటే ఎదుటి వారికే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఏదో రాత్రికి రాత్రే ముసలివాళ్లం అయిపోతామని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

వయసు పెరగడం రాత్రికి రాత్రే జరగదు.. బాడీ షేమింగ్‌పై టబు సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి టబు ప్రస్తుతం అక్కినేని నాగార్జున 100వ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నటీమణుల వయసు, బాడీ షేమింగ్‌పై జరుగుతున్న విమర్శల గురించి స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ల వయసు పెరగడంపై సోషల్ మీడియాలోనూ, బయటా వస్తున్న కామెంట్స్ తనను బాధించాయని టబు అన్నారు. "మన వయసు గురించి మనకంటే ఎదుటి వారికే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఏదో రాత్రికి రాత్రే ముసలివాళ్లం అయిపోతామని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వయసు మళ్లడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. అది ప్రతిరోజూ మన శరీరంలో జరిగే మార్పు.

నిన్న 20 ఏళ్ల వయసులో నిద్రపోయి, ఈరోజు ఉదయాన్నే 45 ఏళ్ల వ్యక్తిలా నిద్రలేవం కదా" అని ఆమె లాజిక్ గా ప్రశ్నించారు. ఈ ప్రక్రియను గౌరవించాల్సింది పోయి, విమర్శించడం సరికాదని అన్నారు. ఇక సినిమాలు రిజెక్ట్ చేసే విషయంలో తన పద్ధతి ఏంటో టబు చాలా స్పష్టంగా చెప్పారు. "చాలామంది నాకు ఒక సలహా ఇస్తుంటారు.. ఏదైనా చిత్రంనచ్చకపోతే డేట్స్ ఖాళీ లేవని అబద్ధం చెప్పి తప్పుకోమని అంటారు. కానీ అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. నాకు కథ నచ్చకపోతే మొహం మీదే నచ్చలేదు అని చెప్పేస్తాను. అదే నా పద్ధతి. అసలు కారణం చెప్పకుండా తప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు" అని తెలిపారు. మొత్తానికి, హీరోయిన్ల వయసు గురించి అనవసరంగా చర్చించే వారికి టబు గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Next Story