మైత్రి సంస్థ దూకుడు.. ఒకే ఏడాదిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్

by Pulgam srinivas |   (  Updated:2026-05-02 15:43:16  IST  )

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ ఏడాది ‘ఆర్‌సీ 17’, ‘ఏఏ 23’ చిత్రాలను ప్రారంభించనుంది.

మైత్రి సంస్థ దూకుడు.. ఒకే ఏడాదిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కాస్త కఠినంగా ఉంది. చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడం లేదు. దాంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో, నిర్మాతలు ఏకకాలంలో రెండు, మూడు భారీ బడ్జెట్ సినిమాలను ప్రారంభించేందుకు వెనుకంజ వేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ధైర్యంగా ముందుకు వస్తోంది. ప్రస్తుతం కొన్ని భారీ చిత్రాలను నిర్మిస్తూనే, ఈ ఏడాది మరో రెండు పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘RC 17’ చిత్రాన్ని ఈ బ్యానర్ నిర్మించనుంది.

ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'AA 23' అనే భారీ బడ్జెట్ ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నాయి. ఒకే ఏడాదిలో ఇలాంటి సూపర్ క్రేజీ ప్రాజెక్టులను స్టార్ట్ చేయనుండడంతో మైత్రి మూవీ మేకర్స్ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతోంది.

19 ఏళ్ల కెరీర్‌లో ఫస్ట్ టైమ్.. ‘పెద్ది’తో చరణ్ సర్‌ప్రైజ్

Next Story