19 ఏళ్ల కెరీర్‌లో ఫస్ట్ టైమ్.. ‘పెద్ది’తో చరణ్ సర్‌ప్రైజ్

by Pulgam srinivas |

రామ్ చరణ్ 19 ఏళ్ల సినీ ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఆయన నటించిన ‘పెద్ది’ సినిమా జూన్ నెలలో విడుదల కానుంది.

19 ఏళ్ల కెరీర్‌లో ఫస్ట్ టైమ్.. ‘పెద్ది’తో చరణ్ సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2007లో ‘చిరుత’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న చరణ్ ఆ తర్వాత 2009లో విడుదలైన ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరో స్థాయికి ఎదిగిపోయాడు. ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 19 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు చరణ్ నటించిన ఏ సినిమా కూడా జూన్ నెలలో విడుదల కాలేదు.

అయితే ఇప్పుడు ఆ సెంటిమెంట్‌కు బ్రేక్ పడబోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో తన 19 ఏళ్ల సినీ ప్రస్థానంలో తొలిసారి చరణ్ సినిమా జూన్‌లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యాంధు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Next Story