- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత ఆ నిర్మాత నన్ను నమ్మారు.. ఎమోషనల్ అయినా హరీష్ శంకర్
హరీష్ శంకర్ మాట్లాడుతూ... మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ నాకు అడ్వాన్స్ పంపారు, ఒక ఫ్లాప్ వల్ల మిమ్మల్ని ఎవరూ జడ్జ్ చేయలేరు, మనం సినిమా చేద్దాం అని అన్నట్లు చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: హరీష్ శంకర్ ఆఖరుగా రవితేజతో మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయింది. తాజాగా ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీని మార్చ్ 19న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అందులో మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత ఆయనకు ఎదురైన ఒక సంఘటన గురించి ఆయన వివరించాడు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్య దేవర నాగ వంశీ గారు నాకు అడ్వాన్స్ పంపారు, అలా పంపడం మాత్రమే కాకుండా ఆయన నాతో ఒక ఫ్లాప్ వల్ల మిమ్మల్ని ఎవరూ జడ్జ్ చేయలేరు, మనం సినిమా చేద్దాం అని ఆయన అన్నారు.
ఆయనతో నాకు కేవలం ఫైనాన్షియల్ మాత్రమే కాదు ఎమోషనల్ కమిట్మెంట్ కూడా ఉందని చెబుతూ హరీష్ శంకర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ దర్శకుడు తాజాగా తెరకెక్కించిన చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం ఈ మూవీ ప్రచార చిత్రాలు బాగుండడం, అలాగే గతంలో పవన్, హరీష్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ భారీ సక్సెస్ కావడం. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించారు.






