ఈ సినిమా చూశాకా కచ్చితంగా మీ మైండ్‌లో అలాంటి ఆలోచన వస్తుంది: డైరెక్టర్ రాజ్ నరేంద్ర

by Chukka Sudharani |

పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో చిత్రీకరించిన సినిమా ‘కలివి వనం’.

ఈ సినిమా చూశాకా కచ్చితంగా మీ మైండ్‌లో అలాంటి ఆలోచన వస్తుంది: డైరెక్టర్ రాజ్ నరేంద్ర
X

దిశ, సినిమా: పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో చిత్రీకరించిన సినిమా ‘కలివి వనం’. ఇందులో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్‌గా నాగదుర్గ పరిచయమవుతోంది. ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నెల 21 రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించారు.

చిత్ర దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ.. ‘సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం అని కూడా తెలియపరుస్తూ ఒక విలేజ్ డ్రామా ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. మీరు సినిమా చూసి బయటకి వచ్చిన తరువాత ఒక మొక్కను నాటాలన్నటువంటి ఆలోచన మీ మైండ్‌లోకి వస్తుంది. అదే మా నినాదం. పిల్లలకి మన ప్రకృతి గురించి, ప్రకృతి అనుబంధం గురించి, ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని చిన్నప్పుడు నుండే వాళ్ళ మెదళ్ళలో నాటితే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదై మహా వృక్షం అవుతుంది. అందుకే చిన్నప్పుడే వాళ్ళ మైండ్‌లో ఇంజెక్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ సినిమా తీయడం జరిగింది. మంచి ఉద్దేశంతో తీసిన 'కలివి వనం' సినిమా 100కు పైగా థియేటర్లలో వస్తుంది. వచ్చి చూడండి ఒక మంచి సినిమాను చూసినటువంటి అనుభూతి మీరు పొందుతారు.ఈ సినిమా మీకు నచ్చితే 10 మందికి చెప్పండి’ అని అన్నారు.

Next Story