- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tandel: ‘జోష్’ రీరిలీజ్ అప్పుడే.. ‘తండేల్’ ఈవెంట్‌లో హింట్ ఇచ్చిన నాగచైతన్య
యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ (Tandel).

దిశ, సినిమా: యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ (Tandel). మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సనిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తు్న్న ఈ చిత్రం.. లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా థర్డ్ సింగిల్ (Third single) ‘హైలెస్సో హైలెస్సా’ను విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో స్టూడెంట్స్ (Students) అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు చైతు. ఇందులో భాగంగా ఓ స్టూడెంట్.. ‘మీరు నటించిన ‘జోష్’ చిత్రం నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే చూడాలని ఉంది. ఎప్పుడు చేస్తారు’ అని ప్రశ్నించాడు. దీనిపై చైతూ స్పందిస్తూ.. ‘‘తండేల్’ సక్సెస్ తర్వాత ‘జోష్’ (Josh) రీరిలీజ్ (Rerelease) ప్లాన్ చేద్దాం’ అని బదులిచ్చాడు. ప్రజెంట్ నాగచైతన్య కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య ‘జోష్’ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వగా.. 2009లో వచ్చిన ఈ మూవీ అప్పటి యూత్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది.






