- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బింగ్ అయ్యాక ఫోన్ కూడా ఎత్తడం లేదు.. రెమ్యూనరేషన్ గురించి ఓపెన్ అయిన రఘు కంచె
రఘు కుంచే మాట్లాడుతూ... కొంతమంది రెమ్యూనరేషన్ సంగతి తర్వాత మొదట డబ్బింగ్ చెప్పమంటున్నారు, చెప్పాక ఫోన్లు కూడా ఎత్తడం లేదని పారితోషికం గురించి ఓపెన్ అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: సంగీత దర్శకులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత నటులుగా కెరీర్ టర్న్ తీసుకున్నవారు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో రఘు కుంచే ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి తన అద్భుతమైన సంగీతంతో శ్రోతలను ఆకట్టుకున్నాడు. ఈయన గత కొంతకాలంగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఎక్కువ శాతం ఈ నటుడు నెగటివ్ పాత్రలతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రఘు 'పలాస' చిత్రంలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే కొంతకాలం క్రితం దేవగుడి అనే చిత్రంలో కూడా ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. తాజాగా గేదెల రాజు చిత్రంలో నటించాడు.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. దాంతో తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మూవీ బృందం పాత్రికేయులతో ముచ్చటించింది. ఇందులో రఘు కుంచే గారికి ఈ మధ్యకాలంలో మీరు విలన్ పాత్రలు బాగా చేస్తున్నారు, మీకు పారితోషకం బాగా వస్తున్నట్టు ఉంది అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే బాగుండేది, ఏదో ఒకటి చెప్పి సినిమా రిలీజ్ అయ్యే టైంకు పారితోషకం మొత్తం లాగే వాడిని, ఇక నటుడిగా అయ్యాక ముందైతే డబ్బింగ్ చెప్పండి అంటున్నారు, డబ్బింగ్ చెప్పాక ఫోన్లు ఎత్తడం లేదు. కొన్ని సినిమాలు అడ్వాన్స్ స్థాయిలోనే ఆగిపోతున్నాయి అని సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చాడు.






