- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రాగన్ తర్వాత ఆ జానర్‌కు గుబ్ బై.. ప్రశాంత్ నీల్ నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్
ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. డ్రాగన్ తర్వాత భారీ యాక్షన్ జానర్‌కు గుబ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు.

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘డ్రాగన్’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. నెట్టింట సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ చేసిన ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భారీ యాక్షన్ జానర్‌కు గుబ్ బై చెప్పనున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ వంటి చిత్రాలు బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని కాసుల వర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు అదే జానర్‌లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే.. ఒకపక్కా ప్రశాంత్ నీల్ వరుస హిట్స్ అందుకుంటున్నాడు అనే టాక్ ఉన్నా.. మరో పక్కా మాత్రం ఒకటే జానర్‌తో విసుగుచెందుతున్నారు కొందరు నెటిజన్లు. కేజీఎఫ్ మొదలు ఇప్పుడు రాబోయే డ్రాగన్ వరకు కూడా అదే డార్క్ భారీ యాక్షన్ జానర్‌తో విసుగుచెందిన నెటిజన్లు కొత్త కథ కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్.. ఇకపై భారీ యాక్షన్ జానర్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు అన్నట్టు ప్రకటించడం విశేషంగా మారింది. అయితే.. ప్రభాస్ సలార్ 2 కూడా లైన్‌లో ఉండగా.. డ్రాగన్, సలార్ 2 అనంతరం కొత్త కథను తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుండగా.. నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






