- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 ఏళ్ల తర్వాత ఆ సినిమా హిట్ సీక్రెట్ బయటపెట్టిన ఏఎం రత్నం
ఏ.ఎం రత్నం మాట్లాడుతూ... 'రన్'లో లింగుస్వామి మొదట శ్రీకాంత్‌ను తీసుకోవాలని అనుకున్నాడు. కానీ నేను మాత్రం మాధవన్ అయితే బాగా సరిపోతాడని సూచించాను. చివరికి మాధవన్‌ను తీసుకోవడం సరైన నిర్ణయంగా మారింది’ అని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: 2002లో మాధవన్ హీరోగా, మీరా జాస్మిన్ హీరోయిన్‌గా రూపొందిన 'రన్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏ.ఎం. రత్నం నిర్మించాడు. ఆ సమయంలో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై దాదాపు 24 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్‌ను నిర్మాత రత్నం తాజాగా బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ… రన్ చిత్ర కథ పూర్తయ్యాక హీరో పాత్రకు శ్రీకాంత్ అయితే బాగుంటాడని దర్శకుడు లింగుస్వామి భావించినట్లు, అయితే తనకు మాత్రం ఆ పాత్రకు శ్రీకాంత్ కంటే మాధవన్ అద్భుతంగా సరిపోతాడని అనిపించిందని చెప్పారు.
దాంతో చివరకు లింగుస్వామి కూడా మాధవన్‌ను హీరోగా ఎంపిక చేయడంతో సినిమా తెరకెక్కిందని వెల్లడించాడు. సినిమా విడుదలైన తర్వాత 'రన్' చిత్రం మాధవన్ కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిందని, చివరకు తాను చెప్పిందే నిజమైందని రత్నం తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ఏ.ఎం. రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'హరిహర వీరమల్లు' చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక ఫెయిల్యూర్‌గా నిలిచింది.






