బయటికి రావడానికి భయపడ్డా ఆయన నా సినిమా చూసి అలా అన్నాడు.. అడవి శేష్

by Pulgam srinivas |

అడవి శేష్ మాట్లాడుతూ.. ఓ లాయర్ నాతో, "నాపై 150 మంది దాడి చేశారు. ఆ తర్వాత భయంతో బయటికి వెళ్లలేకపోయాను. మీ 'మేజర్' మూవీ చూసిన తర్వాతే నాకు ధైర్యం వచ్చింది" అని చెప్పినట్లు ఈ నటుడు వెల్లడించాడు.

బయటికి రావడానికి భయపడ్డా ఆయన నా సినిమా చూసి అలా అన్నాడు.. అడవి శేష్
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటుడు అడవి శేష్ తాజాగా డెకాయిట్ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ప్రస్తుతం భారీ కలెక్షన్లు దక్కుతున్నాయి. దాంతో తాజాగా ఈ మూవీ బృందం ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా అడవి శేష్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నటుడు మాట్లాడుతూ… "డెకాయిట్" చిత్రం విడుదలైన తర్వాత నేను చాలా ప్రాంతాలను సందర్శించాను. అందులో భాగంగా నన్ను అనేక మంది కలిశారు. ఇక తమిళనాడుకు చెందిన ఒక లాయర్ నన్ను కలిసి, ఆయన జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

ఒకానొక సమయంలో నాపై 150 మంది కలిసి దాడి చేశారు. ఆ దాడి అనంతరం నేను చాలా కాలం హాస్పిటల్‌లో ఉన్నాను. కొంతకాలం బయటకు వెళ్లాలన్నా నాకు భయం వేసింది. అలాంటి సమయంలో మీ "మేజర్" సినిమా చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఇక మీరు తాజాగా నటించిన "డెకాయిట్" చిత్రాన్ని కూడా థియేటర్‌కు వెళ్లి చూసాను. ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది అని ఆయన చెప్పినట్లు శేష్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించాడు. షానీల్ డియో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు.

Next Story