Kylie Page : 28 ఏళ్ల అడల్ట్ ఫిల్మ్ స్టార్ అనుమానాస్పద మృతి.. ఇతరులతో ఉన్న సన్నిహిత ఫొటోలు లభ్యం

by Chukka Sudharani |   (  Updated:2025-07-03 15:48:33  IST  )

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.

Kylie Page : 28 ఏళ్ల అడల్ట్ ఫిల్మ్ స్టార్ అనుమానాస్పద మృతి.. ఇతరులతో ఉన్న సన్నిహిత ఫొటోలు లభ్యం
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కైలీ పేజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో జరిగింది. కైలీ పైలెంట్ అలియాస్ కైలీ పేజీ.. 2016లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 200పైగా అడల్ట్ సినిమాలు తీసిన ఈమె.. 2017లో ‘హార్ట్ గర్ల్స్ వాంటెడ్: టర్డ్న్ ఆన్’ అనే డాక్యుమెంటరీ సిరీస్‌లో నటించింది. 28ఏళ్ల వయస్సు ఉన్న కైలీ ఆకస్మిక మరణం అందరిని షాక్ గురిచేసింది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు.. కానీ మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడం వల్లే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే డ్రగ్స్‌కు సంబంధించిన వస్తువులు కూడా ఆమె ఇంటిలో కనపించడంతో ఆ దిశగా విచారణ చేస్తున్నారు పోలీసులు. అంతే కాకుండా.. కైలీ గతిలో ఇతరులతో సన్నిహితంగా ఉన్న గ్రాఫిక్ ఫొటోలు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆత్మహత్య కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.

Next Story