‘చేయాల్సింది చాలా ఉంది’ అంటూ డెకాయిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన అడివి శేష్.. పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-06-06 12:24:54  IST  )

ప్రస్తుతం అడివిశేష్‌(Adivi Shesh) నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌ ఇండియా థ్రిల్లర్‌ ‘డెకాయిట్‌’(Decoit).

‘చేయాల్సింది చాలా ఉంది’ అంటూ డెకాయిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన అడివి శేష్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అడివిశేష్‌(Adivi Shesh) నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌ ఇండియా థ్రిల్లర్‌ ‘డెకాయిట్‌’(Decoit). మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి షానియల్‌ డియో(Shanial Deo) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ(Supreetha Yarlagadda) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకు సునీల్ నారంగ్(Sunil Narang) సహ నిర్మాత. ఇక ఈ మూవీ డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది.

ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌.. ఇంటెన్స్‌ యాక్షన్‌, స్టెలిష్‌ విజవల్స్‌తో అదిరిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు అడివి శేష్. డెకాయిట్‌కి డబ్బింగ్ టెస్ట్ జరిగింది. ఎల్లుండి నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలి.. చేయాల్సింది చాలా ఉంది’ అని క్యూట్ ఫొటో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Next Story