- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సినిమా హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ.. ‘రాజు వెడ్స్ రాంబాయి’పై అడివి శేష్ కామెంట్స్
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’.

దిశ, సినిమా: అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు చిత్ర బృందం. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అడివి శేష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘రాజు వెడ్స్ రాంబాయి సినిమా ట్రైలర్, కొన్ని సీన్స్ చూశాను. ఇలాంటి మంచి కంటెంట్‌ను ప్రమోట్ చేసేందుకే ఈ ఈవెంట్‌కు వచ్చాను. కేరాఫ్ కంచెరపాలెం సినిమాను అనేక చోట్ల సైలెంట్‌గా ప్రీమియర్స్ వేశారు. మీరు కూడా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను రిలీజ్ ముందే ఈ వారం రోజులు వివిధ చోట్ల ప్రీమియర్స్ వేయండి. అప్పుడు రిలీజ్ టైమ్‌కు ప్రేక్షకులే ముందుకు వస్తారు. అంతమంచి మూవీ ఇది. ఇందులో అఖిల్, తేజస్విని, చైతూ బాగా నటించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కు కూడా వస్తాను. చైతు జొన్నలగడ్డకు నా సినిమాలో అవకాశం ఇస్తా. వైరల్ కంటెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రావడం సాధారణ విషయం కాదు. సోషల్ మీడియా యాప్స్ మారుతుంటాయి కానీ ప్రేమ మారదు. ఈ సినిమా జెన్యూన్‌గా చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. హార్ట్ టచింగ్‌గా ఉంటుంది’ అన్నారు.






