Adivi Sesh: అనురాగ్ కశ్యప్ అలాంటివారు.. టామ్ క్రూజ్ సినిమానే రిజెక్ట్ చేశారు

by Pulgam srinivas |

అడవి శేష్ మాట్లాడుతూ.. అనురాగ్ కశ్యప్ గారు జెన్యూన్ పర్సన్. మా సెట్‌లో ఉండగానే ఆయనకు టామ్ క్రూజ్ మూవీలో అవకాశం వచ్చినప్పటికీ, దానిని రిజెక్ట్ చేశారని శేష్ చెప్పుకొచ్చాడు.

Adivi Sesh: అనురాగ్ కశ్యప్ అలాంటివారు.. టామ్ క్రూజ్ సినిమానే రిజెక్ట్ చేశారు
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో అడవి శేష్ 'డెకాయిట్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాను ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అడవి శేష్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అనురాగ్ కశ్యప్ చాలా గొప్ప నటుడు, ఆయన సాధారణంగా సినిమాలు ఒప్పుకోరనే టాక్ ఉంది. అలాంటి వ్యక్తిని మీరు ఎలా మీ సినిమాకు ఒప్పించారు? ఆయన సెట్‌లోకి వచ్చాక మీ ఫీలింగ్ ఎలా ఉంది?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి అడవి శేష్ సమాధానం చెబుతూ... అనురాగ్ కశ్యప్ చాలా జెన్యూన్ పర్సన్. ఏది ఉన్నా నేరుగా మొహంపై చెప్పేస్తారు.

అందువల్ల ఆయన మాటలు కొంతమందికి కఠినంగా అనిపించొచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. మేము సినిమా స్టోరీ చెప్పగానే మా చిత్రంలో నటించడానికి ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆయన దృష్టిలో సినిమా అంటే కేవలం సినిమా మాత్రమే. అది హిందీనా, తెలుగునా అనే భేదం ఆయన చూడరుని తెలిపారు. అలాగే షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను కూడా అడవి శేష్ వెల్లడించాడు. “మేము సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో అనురాగ్ కశ్యప్‌కు ఏకంగా టామ్ క్రూజ్ సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆయన ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేశారు. అది నా కళ్లముందే జరిగింది. ఆ ఆఫర్‌ను తిరస్కరించిన వెంటనే ‘షాట్ రెడీనా.. వెళ్దామా’ అని అడిగారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.

ఆయన దాన్ని అంత లైట్‌గా తీసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను” అని శేష్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా, అది ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను దక్కించుకుంటోంది. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్‌ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు. మరి భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Next Story