- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆదిత్యం’ షార్ట్ ఫిల్మ్‌కు 18 అంతర్జాతీయ అవార్డులు
‘ఆదిత్యం’(Adityam short film) లఘు చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండించుకుంది.

దిశ,తుంగతుర్తి: నిజజీవితంలో ఏర్పడుతున్న ఒడుదొడుకులన్నింటిని దాటుకుంటూ ఒక ఉన్నత లక్ష్యంతో యువత ముందుకు సాగాలనే ఉద్దేశంతో తీసిన ‘ఆదిత్యం’(Adityam short film) లఘు చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండించుకుంది. బాహుబలి ఫేమ్ రాయల హరిచంద్ర ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కించుకోవడం విశేషం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన షేక్ మహమూద్ పాష (Director Sheikh Mahmood Pasha) దర్శకత్వంలో ఆదిత్యం(Adityam) రూపొందింది. 18 నిమిషాల నిడివిగల ఈ లఘు చిత్రం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్(International Film Festival)లో బెస్ట్ స్క్రీన్ ప్లే(Best screenplay) కింద మహమూద్ పాష అవార్డు అందుకున్నారు. ఈ లఘు చిత్రాన్ని ఎంవైఆర్ మ్యూజిక్ అండ్ మూవీ యూట్యూబ్ చానల్లో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే విషయాన్ని చిత్ర దర్శకుడు మహమూద్ పాషా తుంగతుర్తిలో ‘దిశ’తో మాట్లాడుతూ వివరించారు. ముఖ్యంగా నిజజీవితంలో చదువు ముఖ్యమైనప్పటికీ కొంతమంది అందులో రాణించకపోవడం, మరి కొంతమంది ప్రేమ, న్యూ స్టైల్, తదితర అంశాల పరంగా అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. చదివినా, చదవకపోయినా మనిషి ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళితే అనుకున్నవన్నీ సాధించవచ్చుని స్పష్టం చేస్తున్నారు. ఇదే సందేశాన్ని “ఆదిత్యం” ఇస్తుందని పాష వివరించారు.
ఇదిలా ఉంటే త్రిపుర రాష్ట్రంలో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌లో ‘ఆదిత్యం’కు షార్ట్ ఫిలిం, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, లిరిగెస్ట్, డైలాగ్స్ పరంగా ఉత్తమంగా నిలిచిందని తెలిపారు. అలాగే నాగాలాండ్ రాష్ట్రంలో కూడా బెస్ట్ ఫిలిం, స్క్రీన్ ప్లే, ఎడిటర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ రైటర్, సింగర్స్, మ్యూజిక్, డైరెక్టర్, తదితర వాటిపరంగా ఉత్తమంగా ఎంపికై అవార్డులు లభించినట్లు దర్శకుడు షేక్ మహమ్మద్ పాషా వివరించారు. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు తమ ప్రయాణం కొనసాగడం గర్వకారణమని తెలిపారు.






