Aditya Om: రిలీజ్‌కు సిద్ధమైన ‘బంధీ’.. ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ప్రేక్షకులు

by Chukka Sudharani |

సీనియర్ హీరో ఆదిత్య ఓం (Aditya Om) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బంధీ’ (Bandhi).

Aditya Om: రిలీజ్‌కు సిద్ధమైన ‘బంధీ’.. ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ప్రేక్షకులు
X

దిశ, సినిమా: సీనియర్ హీరో ఆదిత్య ఓం (Aditya Om) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బంధీ’ (Bandhi). వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశాన్ని ఇస్తూ డైరెక్టర్ రఘు తిరుమల (Raghu Tirumala) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీని ఇప్పటికే పలు అంతర్జాతీయ (International) వేదికలపై ప్రదర్శించగా.. ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలలో అనేక ప్రశంసలు దక్కాయి. భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా బంధీ రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో హీరో పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోందని ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చారు చిత్ర బృందం.

అంతే కాకుండా భారతదేశం (India)తో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ (Real locations) మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్‌ (Amazing visuals)ను ఈ చిత్రంలో చూడబోతోన్నాం. పర్యావరణ ప్రేమికులందరినీ కదిలించేలా ఈ చిత్రం ఉండనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. కాగా.. టీజర్, ట్రైలర్‌లకు మంచి ఆదరణ లభించడంతో ప్రేక్షకుల్లో సినిమా విడుదలపై మరింత ఉత్కంఠ (excitement) నెలకొంది.

Next Story