ధురంధర్ 3: దిమ్మతిరిగే ప్లాన్ వేసిన ఆదిత్య ధర్

by Pulgam srinivas |

ధురంధర్ చిత్రాన్ని రెండవ భాగంతో ముగించకుండా మూడవ పార్ట్ కి కూడా అవకాశం ఉండేలా ఎండింగ్ ఇవ్వనున్నట్లు, ఇప్పటికే పార్ట్ 3 స్క్రిప్ట్ వర్క్ కూడా ఆదిత్య ధర్ దాదాపు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ధురంధర్ 3: దిమ్మతిరిగే ప్లాన్ వేసిన ఆదిత్య ధర్
X

దిశ, వెబ్ డెస్క్: ధురంధర్ పార్ట్ 1 కొంతకాలం క్రితం విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు ఈ చిత్రంపై హిందీ సినిమా పరిశ్రమలో మినహాయిస్తే బయట పెద్దగా అంచనాలు లేవు. కానీ విడుదలైన తర్వాత అద్భుతమైన టాక్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి పెరిగింది.

చాలా రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 1000 కోట్లకి మించిన వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా రెండవ భాగం మార్చ్ 19వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర బుకింగ్స్ ఓపెన్ కాగా వాటికి మంచి స్పందన లభిస్తుంది.

ఈ చిత్ర రెండవ భాగంపై భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ మరో కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ధురంధర్ చిత్రాన్ని రెండవ భాగంతో ముగించకుండా మూడవ పార్ట్ కి కూడా అవకాశం ఉండేలా ఎండింగ్ ఇవ్వనున్నట్లు, ఇప్పటికే పార్ట్ 3 స్క్రిప్ట్ వర్క్ కూడా ఆదిత్య ధర్ దాదాపు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ధురంధర్ మొదటి భాగం 1000 కోట్లకు మించిన కలెక్షన్లు రాబట్టడంతో 'ధురంధర్ 2'కి హిట్ టాక్ వస్తే సులభంగా 1500 కోట్లకు మించిన వసూళ్లను రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story