- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aditi Shankar: ఆ సినిమా చూసి హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యా.. స్టార్ డైరెక్టర్ కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డైరెక్టర్ శంకర్ (Shankar) కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అదితి శంకర్ (Aditi Shankar).

దిశ, సినిమా: డైరెక్టర్ శంకర్ (Shankar) కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అదితి శంకర్ (Aditi Shankar). ఈ తమిళ బ్యూటీ 2025లో ‘ప్రేమిస్తావా’ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ మే 30న థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. మూవీ అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటున్నారు.
ఇందులో భాంగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ అదితి శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. మీరు తెలుగులో చూసిన ఫస్ట్ మూవీ ఏంటీ అని యాంకర్ ప్రశ్నించగా.. అదితి శంకర్ స్పందిస్తూ.. ‘నేను చాలా సినిమాలు చూశాను. అయితే.. థియేటర్‌లో మొట్టమొదటిసారి చూసిన తెలుగు చిత్రం మాత్రం మగధీర. ఆ టైమ్ నాకు ఆ చిత్రం గూస్ బంప్స్ అనిపించింది. అందులో ప్రతి సీన్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. అలాగే.. ఇలాంటి ఒక సీన్ నా లైఫ్‌లో కూడా రావాలి అనుకున్నాను. అప్పుడే నేను అనుకున్న హీరోయిన్ అవ్వాలని. అలాగే ప్రతి సినిమా చూసినప్పుడు అందులో నన్ను నేను చూసుకునేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది.






