ఫాన్స్ కు షాక్... ‘అదిదా సర్‌ప్రైజు’ లో ఆ స్టెప్పులు తొలగింపు !

by velandi.Saikiran |   (  Updated:2025-08-01 04:59:32  IST  )

హీరో నితిన్ (Nithin), శ్రీ లీల (Sree leela) కలిసి నటించిన రాబిన్ హుడ్ సినిమా టీం దిగివచ్చింది. మహిళా సంఘాల ఆగ్రహానికి

ఫాన్స్ కు షాక్... ‘అదిదా సర్‌ప్రైజు’ లో ఆ స్టెప్పులు తొలగింపు !
X

దిశ, వెబ్ డెస్క్: హీరో నితిన్ (Nithin), శ్రీ లీల (Sree leela) కలిసి నటించిన రాబిన్ హుడ్ సినిమా ( Robin Hood) టీం దిగివచ్చింది. మహిళా సంఘాల ఆగ్రహానికి గురైన రాబిన్ హుడ్ సినిమా బృందం.. ఎట్టకేలకు దిగి రావాల్సి వచ్చింది. ఈ సినిమాలో ‘అదిదా సర్‌ప్రైజు’ అనే ఐటెం సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో హీరోయిన్ కేతిక శర్మ ( Kethika Sharma ) స్టెప్పులు వేసింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే సినిమా రిలీజ్ కాకముందు ఈ ‘అదిదా సర్‌ప్రైజు’ పాటను రిలీజ్ చేయగా... అనేక విమర్శలు వచ్చాయి. ఇందులో అసభ్యకరమైన స్టెప్పులు ఉన్నాయని.. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాదు తెలంగాణ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు కొంతమంది మహిళా సంఘాల సభ్యులు.

వెంటనే అసభ్యకరంగా ఉన్న స్టెప్పులను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే మొదట చిత్ర బృందం... ఈ విషయంలో తగ్గలేదు. కానీ నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో... ఈ ఐటెం సాంగ్ లో ( Item Song) ఉన్న అసభ్యకరమైన స్టెప్పులు తొలగించినట్లు తేలిపోయింది. అయితే ఇండియావ్యాప్తంగా రిలీజ్ అయిన థియేటర్లలో మాత్రమే వివాదాస్పద స్టెప్పులు తొలగించిన పాటను మాత్రమే ప్లే చేశారు. ఓవర్సీస్ లో మాత్రం.. పాత పాటనే ప్లే చేయరు. ఇక ఇండియాలో ఈ వివాదాస్పద సాంగ్ ను ట్రిమ్ చేయడంతో... మహిళా సంఘాలు శాంతించాయి. ఇది ఇలా ఉండగా ఇవాళ రిలీజ్ అయిన రాబిన్ హుడ్ సినిమా.. అద్భుతంగా ఉందని చెబుతున్నారు. సినిమాపై నెగటివ్ రివ్యూల కంటే పాజిటివ్.. వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎంత మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.ఫాన్స్ కు షాక్... ‘అదిదా సర్‌ప్రైజు’ లో ఆ స్టెప్పులు తొలగింపు !

‘అదిదా సర్‌ప్రైజు’ హుక్ స్టెప్ తొలగింపు !

Next Story