- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varalaxmi: రూ.2500లకు ఆ పని చేయాల్సి వచ్చిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి వరలక్ష్మి
లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు తీస్తూ బాగా పాపులర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : నటి వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalaxmi Sarathkumar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె ఎన్నో తెలుగు మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి అందర్ని మెప్పించింది. ఈ మధ్య కాలంలో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు తీస్తూ బాగా పాపులర్ అయింది.
ఈ ముద్దుగుమ్మ తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులను అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ టు హిట్స్ కొడుతూ వరుస చిత్రాలు చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంది. కథ మంచిగా ఉంటే తప్ప సినిమాలను చేయదు. ఇక కెరియర్ మంచిగా ఉన్న సమయంలో లవ్ మ్యారేజ్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. గతేడాది పెళ్లి చేసుకుని సినిమాలకు కొంచం దూరంగా ఉంది.
ఇదిలా ఉండగా.. తాజాగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డబ్బుల కోసం అలాంటి పనిని కూడా చేశానని.. అప్పుడు చేసిన పని వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది. తాజాగా, ఓ డ్యాన్స్ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆ రియాలిటీ షోలో ఓ ముగ్గురు పిల్లల తల్లి డ్యాన్స్ చేస్తూ అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అదే సమయంలో.. ఆమె ఏడుస్తూ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పింది. ఆమెను ఓదార్చే ప్రయత్నంలో తాను కూడా సినిమాల్లోకి రాకముందు ఒక డ్యాన్సర్ నని తెలిపింది. ఒక షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని చెప్పింది. ఆ పని చేసినందుకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి నేను నేడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. కాబట్టి, రోడ్డు మీద డ్యాన్స్ చేయడాన్ని తప్పుగా భావించకూడదు అని ప్రపంచానికి తెలియజేసింది.






