- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల్లోకి త్రిష.. అందులో తప్పేముంది అంటూ ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీ కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ తమిళనాడుకి సీఎం అయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీ కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ తమిళనాడుకి సీఎం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ బ్యూటీ త్రిష విజయ్‌తో రిలేషన్‌లో ఉందనే పుకార్లు కూడా వైరల్ అవుతున్న క్రమంలోనే.. త్రిష సైతం రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రిష రాజకీయాల్లోకి ప్రవేశించడంపై ఆన్‌లైన్‌లో జరుగుతున్న చర్చల గురించి నటి వనితా విజయకుమార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీవీకే పార్టీ త్రిషను అభ్యర్థిగా నిలబెడుతోందన్న నెట్టింట వైరల్ అవుతున్న పోస్టులపై వనితా మాట్లాడుతూ.. ‘అసలు ఈ విషయాన్ని ఎందుకు తప్పుగా భావించాలి. రాజకీయాలకు కావలసిన లక్షణాలు త్రిషలో ఉన్నాయి. ఆమె మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత చదివిన పాఠశాలలోనే చదివారు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, ప్రజలతో గౌరవంగా వ్యవహరిస్తారు. నన్ను అడిగితే త్రిష వంటి వారు రాజకీయాల్లోకి రావాలనే అంటాను’ అని తెలిపినట్లు టాక్. అయితే.. త్రిష రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదా ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.






