నానాపాటేకర్ పై నటి తనుశ్రీ దత్తా మరోసారి సంచలన ఆరోపణలు

by Muthe.Rajitha |

నానాపాటేకర్ పై నటి తనుశ్రీ దత్తా మరోసారి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : నటి తనుశ్రీ దత్తా(TanuSri Dutta) సీనియర్ నటుడు నానా పాటేకర్‌(Nana Patekar)పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనూశ్రీ మాట్లాడుతూ.. నానాపటేకర్ తనను చంపాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను చంపిన మాదిరి తన హత్యకు కూడా ఆయన కుట్ర పన్నుతున్నారని హాట్ కామెంట్స్ చేసారు. అయితే వీరి ఇద్దరి మధ్య గత కొన్నేళ్లుగా వీరి ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. 2008లో తనను ఓ సాంగ్ లో అసభ్యంగా తాకారని తనూశ్రీ నానాపటేకర్ పై మీటూ ఉద్యమంలో భాగంగా సంచలన ఆరోపణలు చేసారు.

అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు మొత్తం బాలీవుడ్ ను పట్టి కుదిపేశాయి. అయితే సరైన ఆధారాలు లేని కారణంగా ఈ కేసును పోలీసులు మూసివేశారు. గత ఏడాది కూడా తనూశ్రీ ఇలాంటి ఆరోపణలు చేసారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి నానాపటేకర్ తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ, తనకు రక్షణ కల్పిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని నటి ప్రకటించారు.

Next Story