- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఫోన్ నెంబర్ కోసం అతను అన్ని రూపాయలు ఖర్చు చేశాడు: సుప్రీత
ఓ ఇంటర్వ్యూలో సుప్రీత షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. అక్కడ విచిత్రమైన ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి "మీ ఫోన్ నెంబర్ కోసం 20000 ఖర్చు చేశాను. మిమ్మల్ని నేను చాలా బాగా చూసుకుంటాను... నాతో వచ్చేయండి" అని అన్నాడు. దానితో నేను ఫోన్ కట్ చేసి, కాసేపు నవ్వుకొని ఆ నెంబర్‌ను బ్లాక్ చేశాను అని సుప్రీత తెలియజేసింది.

దిశ, వెబ్ డెస్క్ : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుప్రీత ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించింది. ఈమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. సుప్రీత మొదటి నుండి కూడా సోషల్ మీడియా ద్వారానే మంచి ఫాలోయింగ్ను దక్కించుకుంది. తరచూ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.
అలాగే అప్పుడప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. సుప్రీత నిజ జీవితంలో ముక్కుసూటిగా ఉంటుంది. అనేక విషయాలపై ఎలాంటి మొహమాటం లేకుండా స్పందిస్తూ ఉంటుంది. ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండడం వల్ల ఈమెకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తాజాగా సుప్రీత మాట్లాడుతూ... "సోషల్ మీడియాలో విచిత్రమైన ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. తాజాగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను అది లిఫ్ట్ చేసి మాట్లాడాను.
దానితో అవతల ఉన్న వ్యక్తి మీ ఫోన్ నెంబర్ పొందడం కోసం 20000 ఖర్చు పెట్టాను. దీని ద్వారానే మీకు తెలియాలి నేను మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాను అనేది. మీరు వెంటనే నా దగ్గరికి వచ్చేయండి. మీకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాను" అని అన్నాడు. దాంతో నేను ఫోన్ కట్ చేసి కాసేపు నవ్వుకున్నాను. ఆ తర్వాత ఆ నెంబర్ బ్లాక్ చేశాను. అలా ఒక వ్యక్తి నా ఫోన్ నెంబర్ పొందడం కోసం ఎంతో ఖర్చు చేసి, నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాడు. అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది అని సుప్రీత చెప్పుకొచ్చింది.






