Heena Khan: క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి.. ఆ పని చేస్తూ ఫొటో షేర్ చేయడంతో నెట్టింట దారుణ ట్రోల్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-29 15:05:49  IST  )

గత కొద్ది కాలంగా నటి హీనా ఖాన్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Heena Khan: క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి.. ఆ పని చేస్తూ ఫొటో షేర్ చేయడంతో నెట్టింట దారుణ ట్రోల్స్
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా నటి హీనా ఖాన్(Heena Khan) అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. పలు సీరియల్స్ ద్వారా షుల్ ఫేమ్ తెచ్చుకున్న ఆమె క్యానర్ కారణంగా బుల్లితెరకు కూడా దూరం అయింది. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను తన అభిమానులతో పంచుకుంటోంది. అంతేకాకుండా తన ఆరోగ్య పరిస్థితిని అందరికీ తెలిసేలా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. అయితే ఇటీవల ఆమెకు తన బాయ్‌ఫ్రెండ్ సేవలు చేస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తనను వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడనడంతో అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

ఇక హీనా ఖాన్ మాత్రం తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుపుతూ వరుస పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా, హీనా ఖాన్ ఓ ఫొటో షేర్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టుకుందని అంతా దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో.. హీనా ఖాన్ ఇన్‌స్టా ద్వారా రియాక్ట్ అయింది. ‘‘ మీలో చాలామంది నా నెయిల్స్ గురించి అడుగుతున్నారు. అయితే నేను గోర్లకు నెయిల్ పాలిష్ వేసుకున్నాను అని అందరూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు.

కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నేను అసలు గోర్లకు ఏం పెట్టుకోలేదు. గోర్లపేంట్ పెట్టుకుని నేను ఎలా ప్రార్థించగలను. రంజాన్ నెలలో నమాజ్ చేసే సమయంలో గోర్లకు పాలిష్ వేసుకోవద్దే నియమం కూడా ఉంది. నోటికి వచ్చింది మాట్లాడేముందు అందరూ కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించండి. కీమోథెరపీ వల్ల నా గోర్లు అలా మారిపోయాయి. కొన్నిసార్లు గోళ్లు విరిగి వాటంతట అవే రాలిపోతాయి. ఇదంతా తాత్కాలికమే. త్వరలోనే కోలుకుంటానని అనుకుంటున్నాను. అందరూ మేము నమాజ్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి’’ అని రాసుకొచ్చింది. అలాగే తన గోర్లను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం హీనా ఖాన్ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. అయినప్పటికీ తాను పలు కార్యక్రమాలకు హాజరవుతూ ఆ వ్యాధితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు ఇస్తూ ఉంటుంది.

Read More..

ఆ పార్ట్‌కు రూ.2.4కోట్ల డైమండ్ ధరించిన గ్లోబల్ క్వీన్.. మేడం చాలా రిచ్ గురూ అంటున్న నెటిజన్లు

Next Story