- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
61 వయసులో ఆ పనులు...ఆ సీక్రెట్ బయటపెట్టిన టాలీవుడ్ నటి !
వాము, వేడి నీళ్లు కలిపి.. నిత్యం తాగుతానని... దానివల్ల తాను ఇప్పటికీ కూడా యాక్టివ్ గా కనిపిస్తానని పేర్కొంది. అలా వేడినీ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంత మంది అతి తక్కువ కాలంలో పాపులర్ అయితే... మరి కొంతమంది సక్సెస్ కావడానికి ఇంకా కష్టపడుతున్నారు. ఇక మరికొంతమంది నటీమణులు అయితే... ఏజ్ పైబడినప్పటికీ వరుస ఛాన్స్ లతో దూసుకు వెళ్తున్నారు.
అయితే అలాంటి లేడీ యాక్టర్స్ లో సుధ ( Sudha ) ఒకరు. ఈ టాలీవుడ్ ఆంటీ... అనేక పాత్రలో నటిస్తూ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు 500 సినిమాల్లో ఆమె నటించింది. అతడు, దూకుడు, బాద్షా, గ్యాంగ్ లీడర్ లాంటి ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు సుధ. అయితే ప్రస్తుతం ఆమె వయసు 61 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ యంగ్ హీరోయిన్లకు ఉన్న ఫిట్నెస్ ఆమె కూడా ఉంటుంది.
అయితే అలా ఫిట్ గా ఉండడానికి గల కారణాలను తాజాగా రివీల్ చేసింది నటి సుధ. వాము, వేడి నీళ్లు కలిపి.. నిత్యం తాగుతానని తాజాగా వెల్లడించింది. దానివల్ల తాను ఇప్పటికీ కూడా యాక్టివ్ గా కనిపిస్తానని పేర్కొంది. అలా వేడినీళ్లు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతాయని వివరించింది. తాను అలా వేడి నీళ్లు చిన్నప్పటి నుంచి తాగుతున్నానని తెలిపింది. తన హెల్త్ సీక్రెట్ ఆ నీళ్లు మాత్రమేనని వివరించింది. క్లిక్






