ఆ ఇద్ద‌రు భామ‌ల‌తో ప్రదీప్ రంగనాథన్ రొమాన్స్..మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా!

by velandi.Saikiran |

తన సొంత డైరెక్షన్ లో హీరోగా మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను కూడా ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

ఆ ఇద్ద‌రు భామ‌ల‌తో ప్రదీప్ రంగనాథన్ రొమాన్స్..మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తమిళ స్టార్ హీరో ప్రదీప్ రంగనాథన్ ( Pradeep Ranganathan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోమలి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్, ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తారు. లవ్ టుడే సినిమాతో 2022లో సక్సెస్ అందుకున్న ప్రదీప్, డ్రాగన్, డ్యూడ్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేశారు. ముఖ్యంగా మొన్న డ్యూడ్ సినిమాతో సందడి చేసిన ప్రదీప్, తెలుగులో కూడా మార్కెట్ పెంచుకున్నాడు. అలాంటి హీరో ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మళ్లీ దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్నారట.

తన సొంత డైరెక్షన్ లో హీరోగా మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను కూడా ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. శ్రీ లీల ( Sree leela), మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary) లాంటి అందాల తారలతో కొత్త సినిమా చేయబోతున్నారట ప్రదీప్. సైంటిఫిక్ , లవ్, కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నారట. మరి ఈ సినిమా జనాలను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Next Story