- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లికాబోతున్న టాలీవుడ్ బ్యూటీ..బేబీ బంప్ ఫోటోలు వైరల్
Sonarika Bhadoria బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో తన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ సోనారిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తన నటన, అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తెలుగులో ఈ చిన్నది జాదుగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ బ్యూటీ తాజాగా తన అభిమానులకు శుభవార్త చెప్పారు.
2022లో సోనారిక తన ప్రియుడు, ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ పరషార్ తో ఎంగేజ్మెంట్ చేసుకోగా... ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈమె బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో తన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె బేబీ బంప్ తో తల్లి కాబోతున్నారని తన అభిమానులకు స్పష్టం చేశారు. దీంతో సోనారిక అభిమానులు, సినీ నటులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం సోనారికకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.






