ఆడాళ్లు సోమ‌రిపోతులు..వాళ్ల‌కు ఎక్కువ డ‌బ్బులు సంపాదించే మగాడే కావాలి !

by velandi.Saikiran |

భారతదేశంలో ఉన్న మహిళలు అందరూ సోమరిపోతులుగా మారిపోయారని మండిపడ్డారు సోనాలి కులకర్ణి.

ఆడాళ్లు సోమ‌రిపోతులు..వాళ్ల‌కు ఎక్కువ డ‌బ్బులు సంపాదించే మగాడే కావాలి !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియాకు చెందిన ప్రముఖ నటి సోనాలి కులకర్ణి ( Sonali Kulkarni ) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. హిందీ, మరాఠి, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు.. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సోనాలి కులకర్ణి. అయితే అలాంటి సీనియర్ సోనాలి కులకర్ణి ( Sonali Kulkarni) మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మ‌హిళ‌లు సోమ‌రిపోతులే : సోనాలి కులకర్ణి

భారతదేశంలో ఉన్న మహిళలు అందరూ సోమరిపోతులుగా మారిపోయారని మండిపడ్డారు సోనాలి కులకర్ణి. ఏ పని చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు మహిళలు చురుకుగా పనిచేసేవారని.. ఇప్పటి జనరేషన్ మహిళలందరూ బద్ధకస్తులేనని పేర్కొన్నారు. ఇక వీళ్లకు ఎక్కువ డబ్బులు సంపాదించే మగాళ్లు మాత్రమే కావాలని.. అలాంటి వాళ్లను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. దీంతో సోనాలి కులకర్ణి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

నాని సినిమాలో సోనాలి కులకర్ణి

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మూవీలో భారతీయ నటి సోనాలి కులకర్ణి ప్రత్యేక రోల్ చేస్తున్నారట. ఆమె తల్లి పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. కాగా శ్రీకాంత్ ఓదెల‌ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ సినిమా వస్తోంది. మార్చి 26వ తేదీన సినిమాను రిలీజ్ చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.

Next Story