Simran: అదొక ఎవర్ గ్రీన్ సినిమా.. ఎప్పుడు వచ్చిన ప్రేక్షకులు ఇష్టపడతారు.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిట్స్ అందుకుంటోంది సీనియర్ నటి సిమ్రాన్.

Simran: అదొక ఎవర్ గ్రీన్ సినిమా.. ఎప్పుడు వచ్చిన ప్రేక్షకులు ఇష్టపడతారు.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిట్స్ అందుకుంటోంది సీనియర్ నటి సిమ్రాన్. తాజాగా ఈమె ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను యూట్యూబర్ అయిన అభిషాన్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించాడు. మే 1న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో ప్రజెంట్ ఈ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న సిమ్రాన్ వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది.

ఈ క్రమంలోనే హీరో చియాన్ విక్రమ్ (Chiyan Vikram) నటిస్తున్న ‘ధ్రువ నక్షత్రం’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ధ్రువ నక్షత్రం’ అనేది పూర్తి యాక్షన్ సినిమా. ఇది చాలా స్టైలిష్ మూవీ.. ఆ సినిమా విడుదల కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. సినిమా ఖచ్చితంగా సరైన సమయంలో వస్తుంది. విక్రమ్ అద్భుతమైన నటుడు. అతను సినిమాలో కూడా స్టైలిష్‌గా నటించాడు. ఇది ఎవర్ గ్రీన్ సినిమా. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా జనాలు ఖచ్చితంగా ఇష్టపడతారు’ అని తెలిపారు.

Next Story