- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Irumudi: రవితేజ సినిమాలో 56 ఏళ్ల హీరోయిన్ !
రవితేజ హీరోగా చేస్తున్న ఇరుముడి సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏడాదికి కనీసం రెండు చొప్పున సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళ్తున్నాడు రవితేజ. అయితే అలాంటి రవితేజ ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న "ఇరుముడి" సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియ భవాని శంకర్ నటిస్తున్నారు. రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర మెరువనున్న సంగతి తెలిసిందే.
అయితే లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వైరల్ గా మారింది. రవితేజ హీరోగా చేస్తున్న ఇరుముడి సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ పాత్ర సినిమాకే కీలకంగా మారనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. రవితేజ, శోభన మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఒకానొక సమయంలో ప్రేక్షకులు కూడా కంటతడి పెడతారట. ఆ రేంజ్ లో 56 ఏళ్ల సీనియర్ హీరోయిన్ శోభన పాత్ర ఉండనున్నట్లు టాక్.






