బాలయ్య ఎనర్జీ ముందు ఎవరు సరిపోరు.. అఖండ-2 ఈవెంట్‌లో నటి సంయుక్త హాట్ కామెంట్స్

by Ramesh Naini |

నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అఖండ -2 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

బాలయ్య ఎనర్జీ ముందు ఎవరు సరిపోరు.. అఖండ-2 ఈవెంట్‌లో నటి సంయుక్త హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నందమూరి బాలకృష్ణ (Balakrishna) సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో (Akhanda 2) అఖండ -2 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అఖండ 2 లో ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సందర్భంగా ఈవెంట్‌లో నటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. మై డియర్ బాలయ్య గారు అసలు మీతో బ్యాడ్ డే అనేది ఉండదు.. ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటారని, తన ఎనర్జీ ముందు ఎవరు సరిపోరు అని, తనకు కూడా అంత ఎనర్జీ లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన హిందూపురం గురించి చెప్పారని, ప్రజలకు అది చేయాలి, ఇది చేయాలి అని చెబుతారని తెలిపారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి చెప్పారని వివరించారు. ఆయన ప్రజలకు ఎంతో మంచి చేయడానికి కృషి చేస్తారని హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నో సినిమాలు బాలయ్యతో చేయాలని ఆకాంక్షించారు.

అలాగే సినిమా గురించి మాట్లాడుతూ.. నాకు శివుడు అంటే భక్తి కాదు ప్రేమ అని, చిన్న వయసు నుంచే శివుడు గురించి ఏదైనా సరే చేయాలనుకున్నానని అన్నారు. శివుడు నాలో ఒక భాగం అందుకే ఈ చిత్రంలో తాను భాగం అయ్యానని తెలియజేశారు. కుంభమేళాకు వెళ్దాం అనుకున్న సమయంలో తనకు అఖండ 2 లో నటించే అవకాశం వచ్చిందన్నారు. అయితే అది చిన్న పాత్రని చెప్పారు అయినా కూడా తాను ఓకే చెప్పానని, బోయపాటి యాక్షన్ ఫుల్ ఎనర్జీటీగా ఉంటుందన్నారు.

Next Story