Samnatha : నటి సమంతకు మళ్ళీ అనారోగ్యం!

by Muthe.Rajitha |

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది.

Samnatha : నటి సమంతకు మళ్ళీ అనారోగ్యం!
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. రెండేళ్ల క్రితం మయోసైటీస్(Myositis) తో తీవ్ర అస్వస్థతకు గురవడం సంచలనం రేపింది. తన అనారోగ్య పరిస్థితి విషయం ప్రకటించి.. సుమారు ఏడాదిపాటు సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంది. ఆసమయంలో అమెజాన్ ప్రైమ్ సిరీస్ సిటాడెల్(Citadel) చిత్రీకరణలో సామ్ పాల్గొనాల్సి ఉండగా.. మూవీ మేకర్స్ సెట్లో అన్నీ సౌకర్యాలు సమకూర్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ కానిచ్చారు. సెట్లో రెండుసార్లు కళ్ళు తిరిగి పడిపోయినప్పటికీ.. కొద్దిగా రెస్ట్ తీసుకొని సమంత ఆ షూట్ కంప్లీట్ చేసింది. కాగా తాజాగా శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్(Instagram) ఖాతాలో సామ్ పోస్ట్ చేసిన స్టోరీతో.. మళ్ళీ తను అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. చికెన్ గున్యా(Chikungunya) నుంచి కొలుకుంటున్నానని తెలుపుతూ జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఓ వీడియోను అభిమనులతో పంచుకుంది. చికెన్ గున్యా, కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం ఎంత సరదాగా ఉందో అని రాసుకొచ్చింది. అయితే మళ్ళీ సామ్ కి ఏమైందో అని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






Next Story