ఏపీలో హీరోయిన్ సమంతకు గుడికట్టిన అభిమాని..ఇదెక్కడి పిచ్చి భయ్యా!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-28 12:31:25  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని ఏకంగా గుడి కట్టి అందులో విగ్రహం పెట్టాడు.

ఏపీలో హీరోయిన్ సమంతకు గుడికట్టిన అభిమాని..ఇదెక్కడి పిచ్చి భయ్యా!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని ఏకంగా గుడి కట్టి అందులో విగ్రహం పెట్టాడు. ఏపీలోని బాపట్లకు చెందిన సందీప్ అనే అభిమాని ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు. నేడు సమంత పుట్టిన రోజు కావడంతో గుడిలో భోజనాలు పెట్టడంతో పాటూ కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. సమంతకు తాను వీరాభిమాని అని చెప్పారు. మూడు సంవత్సరాలుగా సమంత పుట్టిన రోజును వేడుకగా జరుపుతున్నట్టు తెలిపారు.

గుడి కట్టి కూడా మూడు సంవత్సరాలు అవుతోందని అన్నారు. సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది పిల్లలకు అన్నధానం చేయడం, పేదలకు సాయం చేస్తున్నానని చెప్పారు. ఇలా చేయడం తనకు ఇష్టం అని అందుకే చేస్తున్నానని సందీప్ తెలిపారు. ఇదిలా ఉంటే హీరోయిన్ కు గుడి కట్టిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్ ఏం చేసిందని గుడి కట్టారు దేవుడికో లేదా మీ పూర్వీకులు ఎవరికైనా కట్టినా బాగుండేదేమో అని సలహాలు ఇస్తున్నారు. మరి కొందరు గుడి మాట పక్కన పెడితే ఆమె పుట్టినరోజున సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి సాయం చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు.

Next Story