- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీం తీర్పు సిగ్గుచేటు, అది నన్ను చంపేసింది..బోరున ఏడ్చేసిన సదా
టాలీవుడ్ నటి సదా సుప్రీకోర్టు ఢిల్లీలోని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లో షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి సదా సుప్రీకోర్టు ఢిల్లీలోని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లో షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై ఆమె బోరున ఏడుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు సిగ్గుచేటు, హృదయవిదారకం అని అన్నారు. కోర్టు తీర్పు తనను లోలోపల చంపేస్తోందని, మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉందని అన్నారు. దాదాపు 3 లక్షల వీధి కుక్కలను తరలించడం అంటే సరైన షెల్టర్ సౌకర్యాలు లేనందున ఇది అమానవీయ చర్య కావచ్చని, వాటి సామూహిక నిర్మూలను దారి తీసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టెరిలైజేషన్, వాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైన అధికారులను, ప్రభుత్వాలని ఆమె విమర్శించారు. అంతే కాకుండా లోకల్ కుక్కలను కాకుండా బ్రీడ్ లను కొనుగోలు చేసి పెంచుకునే యజమానులను సైతం ఆమె విమర్శించారు. ఈ కారణాల వల్లనే వీధి కుక్కలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.
కమ్యూనిటీ ఫీడింగ్, సరైన యానిమల్ బర్త్ కంట్రోల్ అమలు చేయడం ద్వారా సరైన పరిష్కారం దొరుకుతుందని వాదించారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పును కేవలం సదా మాత్రమే కాకుండా చాలా మంది సెలబ్రెటీ డాగ్ లవర్స్ వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం తన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. video
Read More..
సేవ్ డాగ్స్ కు వ్యతిరేకంగా స్ట్రే డాగ్స్ పోరాటం.. వందల వీడియోస్ అప్లోడ్






