- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేవ్ డాగ్స్ కు వ్యతిరేకంగా స్ట్రే డాగ్స్ పోరాటం.. వందల వీడియోస్ అప్లోడ్
ఢిల్లీ(Delhi) వీధుల్లో కుక్కల(Stray Dogs)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు జంతుప్రేమికులు.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ(Delhi) వీధుల్లో కుక్కల(Stray Dogs)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు జంతుప్రేమికులు. అధికారులు చేసిన తప్పిదాలకు ముగా జీవాలను ఎందుకు శిక్షించడం అంటూ మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు జంతుప్రేమికులు అంతా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ సేవ్ డాగ్స్(SaveDogs) పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసారు. ఇదిలా ఉంటే వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ కు తరలించాల్సిందేనంటూ అనేకమంది హ్యాష్ ట్యాగ్ స్ట్రే డాగ్స్ పేరుతో మరో ఉద్యమాన్ని లేవనెత్తారు.
ప్రతియేటా వందలమంది రేబిస్ తో చనిపోతున్నారని, పదుల సంఖ్యలో చిన్నపిల్లలు కుక్కల దాడిలో అత్యంత దారుణంగా ప్రాణాలు వదులుతున్నారని, వీటన్నిటి కారణం అయినా వీధి కుక్కలను నగరాలకు, పట్టణాలకు దూరంగా షెల్టర్ హోమ్స్ కు తరలించాలని సుప్రీం ఇచ్చిన తీర్పుకు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు కుక్కలు చిన్న పిల్లలపై, దారిన పోతున్న వారిపై చేస్తున్న దాడుల వీడియోలను వందలకొద్దీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. కుక్కల ప్రేమికులు వీటికి ఏం సమాధానం చెబుతారని మండిపడుతున్నారు.
Read More..
సుప్రీం తీర్పు సిగ్గుచేటు, అది నన్ను చంపేసింది..బోరున ఏడ్చేసిన సదా






