- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన కోసం ఏ పాత్ర అయినా ఓకే.. ఆ డైరెక్టర్‌పై యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘దిల్ కబడ్డీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సబా ఆజాద్.. ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

దిశ, సినిమా: ‘దిల్ కబడ్డీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సబా ఆజాద్.. ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘అనురాగ్ సినిమా తీసిన ప్రతిసారీ ఎంతో మంది అద్భుతమైన నటీనటులను ఎంపిక చేసుకుంటారు. ఆయనకు అంతటి గౌరవం ఉంది. ఆయన నటీనటులకు గౌరవం ఇస్తారు కాబట్టి, ఒక్కసీన్ పాత్రకైనా నటీనటులు ఒప్పుకుంటారు. ఎంత చిన్న పాత్ర అయినా సరే ఆయన ప్రతి పాత్రను లోతుగా రాస్తారు. ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. అలాగే అవి కేవలం ప్రధాన పాత్రకు మద్దతుగా ఉండవు.. వాళ్లకంటూ ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇచ్చేలా ఉంటాయి. ఆ విషయమే నటీనటులు అతని సినిమాలో నటించేందుకు లొంగిపోయేలా చేస్తాయి. చిన్న పాత్రలో కూడా తాము గుర్తింపు పొందుతామని, ప్రశంసలు అందుకుంటామని నటీనటులకు తెలుసు. అందుకే ఆయన సినిమా అంటే వెంటనే ఓకే చేసేస్తారు’ అని అనురాగ్ కశ్యపై ప్రశంసలు కురిపించింది.






