- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ వీడియో లీక్ కావడంపై స్పందించిన నటి.. మీ తల్లి, చెల్లిది చూసుకోండి అంటూ సెన్సేషనల్ పోస్ట్
కోలీవుడ్ నటి శృతి నారాయణన్(Shruti Narayanan) ప్రైవేట్ వీడియో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: కోలీవుడ్ నటి శృతి నారాయణన్(Shruti Narayanan) ప్రైవేట్ వీడియో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్నట్లుగా క్రియేట్ చేసి నెట్టింట షేర్ చేస్తుండటంతో శృతి పేరు మార్మోగిపోతుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్తలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టా ద్వారా స్పందించింది. ఈ మేరకు వరుస పోస్టులు షేర్ చేసింది. ‘‘గత కొద్ది రోజుల నుంచి నా వీడియోను షేర్ చేస్తున్నారు. మీకు సరదాగా ఉందేమో. కానీ నాకు నా కుటుంబానికి చాలా బాధగా ఉంది. నేను అమ్మాయిని కాబట్టి నాకూ భావోద్వేగాలు ఉంటాయి. దయచేసి వీడియోను వైరల్ చేయకండి.
మీకు మరీ అలాంటివి చూడాలనిపిస్తే మీ చెల్లిదో, అమ్మతో, భార్యతో, ప్రేయసిదో చూసుకోండి. వారికి కూడా నాలాంటి శరీరమే ఉంటుంది కాబట్టి చూసి సంతోషించండి. మరికొందరు అవకాశాల కోసం ఇలా చేశానని దారుణంగా తిడుతూ తప్పుపడుతున్నారు. మీకిదంతా వినందంగా ఉందేమో కానీ ఒకరి జీవితం అని గ్రహించట్లేదు ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అలాంటి వీడియోలు చూసేవారిది? వైరల్ చేసేవారిది తప్పు కాదా? మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావిస్తోంది కేవలం ఒక వీడియో కాదు.. ఒక మనిషి జీవితం అని గుర్తించండి. ఈ డీప్‌ఫేక్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. అందులో నిజమెంత ఉందో అనేది తెలుసుకోకుండా వైరల్ చేస్తున్నారు. అలా చేయడం చాలా తప్పు మనుషులుగా ప్రవర్తించడం నేర్చుకోండి’’ అని రాసుకొచ్చింది.






