- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కలు, పిల్లులు పోతాయి, మనం కూడా పోతాం.. మరోసారి రేణూదేశాయ్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి రేణూదేశాయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ స్టా లైవ్‌లో మాట్లాడుతూ కుక్కలను చంపడంపై అసహనం వ్యక్తం చేశారు. కుక్కలు, పిల్లులు చనిపోతాయని అన్ని ప్రాణులు చనిపోతాయని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి రేణూదేశాయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ స్టా లైవ్‌లో మాట్లాడుతూ కుక్కలను చంపడంపై అసహనం వ్యక్తం చేశారు. కుక్కలు, పిల్లులు చనిపోతాయని అన్ని ప్రాణులు చనిపోతాయని అన్నారు. ఏదో ఒకరోజు మనుషులు కూడా చనిపోతారని వ్యాఖ్యానించారు. ప్రభాస్ కల్కి సినిమాలో ఏం చూపించారో అదే జరుగుతుందని అన్నారు. ఎప్పటికైనా చనిపోయేదేనని కాస్త ప్రశాంతంగా చనిపోవాలని అన్నారు. ఎలాంటి ద్వేషాలు లేకుండా ఉండాలని అదే తాను కోరుకుంటున్నానని చెప్పారు.
ఇక ఇటీవల మీడియా సమావేశంలో రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒక కుక్క కరిస్తే ఉన్న కుక్కలన్నింటినీ చంపాలని చెబుతున్నారని మరి మగాళ్లు రేప్ చేస్తే మగాళ్లందరినీ ఎందుకు చంపడం లేదని ప్రశ్నించారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. స్వార్థం పెరిగిపోయిందని అన్నారు. కుక్కలను చంపవద్దని కోరారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధిపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రేణూ దేశాయ్ వ్యాఖ్యలను కొంతమంది సమర్ధిస్తే చాలా మంది వ్యతిరేఖించారు.






