- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Radhika: ఆస్పత్రిలో నటి రాధిక.. ఫొటోస్ వైరల్.. ఆందోళనలో ఫ్యాన్స్
సీనియర్ యాక్టర్ రాధిక(Radhika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ యాక్టర్ రాధిక(Radhika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా చిరంజీవి(Chiranjeevi) సరసన అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి అలరించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. రాధిక శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. జులై 28న ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్యులు రాధికకు ట్రీట్ మెంట్ అందిస్తున్నట్టు సమాచారం.
అయితే స్టార్టింగ్‌లో ఇది నార్మల్ ఫీవర్ అని భావించగా, వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయ్యిందట. అందుకే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా, పూర్తిగా కోలుకునే వరకు హాస్పిటల్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. కాగా రాధిక ఆస్పత్రి పాలయ్యారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link






