పెద్ది సాంగ్ పాడుతూ హీరోయిన్ చిల్, క్యూట్ వీడియో వైర‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-05-08 21:13:52  IST  )

కారులో ప్రయాణిస్తూ పెద్ది పాట పాడింది నటి రాశి సింగ్.

పెద్ది సాంగ్ పాడుతూ హీరోయిన్ చిల్, క్యూట్ వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నటి రాశి సింగ్ ఒకరు. ఈమె బంపర్ హిట్ సినిమాలు చేయకపోయినా.. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. శశి సినిమాతో 2021 లో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రాశి సింగ్, భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ప్రసన్న వదనం సినిమాలో నెగిటివ్ రోల్ చేసి, మంచి మార్కులు సంపాదించింది.

పెద్ది సినిమా పాట పాడుతూ సందడి చేసిన రాశి సింగ్

రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం కాగా... ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి పాట రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. అయితే లేటెస్ట్ గా నటి రాశి సింగ్.. కారులో ప్రయాణిస్తూ ఈ పాట పాడింది. కారులో పెద్ది మూవీ సాంగ్ రాగానే.. తాను కూడా ఎంజాయ్ చేస్తూ గానం అందుకుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన‌ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ వైరల్ గా మారాయి.

Next Story